MHBD: సీసీ కెమెరాలతోనే నేరాలను నియంత్రించవచ్చని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. తొర్రూరు మండలంలోని చర్లపాలెం గ్రామంలో సర్పంచ్ ధర్మారపు మహేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.