MDK: జిల్లా సంస్కృతీ సంప్రదాయాలకు, కళలకు పుట్టినిల్లని అదనపు కలెక్టర్ నగేష్ కొనియాడారు. కలెక్టరేట్లో యువజన కేంద్రాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో కళలకు మరింత గుర్తింపు తేవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్యాలు ఎంతగానో అలరించాయి.