JGL: శ్రీపాద రావు సేవలు మరువలేనివని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 27వ వర్ధంతి సందర్భంగా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్, సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యేగా సేవలందించినా, ఆయన స్పీకర్గా రాష్ట్రానికి గౌరవం తెచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.