KMR: మద్యం మత్తులో వాహనాలు నడిపితే వారికి జైలు జీవితం తప్పదని ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం హెచ్చరించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు కేవలం వాహనదారుడినే కాకుండా, రోడ్డు మీద ప్రయాణించే అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతున్నాయన్నారు.