KNR: తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాలకు సంవత్సరాలుగా ముసుగులు వేసి ఆవిష్కరణ చేయకపోవడం అన్యాయమని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వెంటనే ముసుగులు తొలగించి గౌరవంగా ఆవిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించాలని వారు కోరారు.