NGKL: మక్తల్ మున్సిపాలిటీ నుంచి చిట్యాల వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.