E.G: సీతానగరం PHC వద్ద మంగళవారం నిర్వహించిన HPV వాక్సినేషన్ ప్రక్రియను రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. అమ్మాయిల్లో క్యాన్సర్ ముప్పును తప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించిందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV టీకాల పంపిణీ చేస్తుందని చెప్పుకొచ్చారు.