TPT: ఈ నెల 12న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక సహాయక పరికరాల గుర్తింపు శిబిరం జరుగుతోందని ఎంపీడీవో చంద్రశెఖర్ తెలిపారు. వీల్ చైర్లు, చేతి కర్రలు, ట్రైసైకిల్, వినికిడి యంత్రాలు, ప్రత్యేక వైద్య కిట్లు వంటి పరికరాలు అందించబడతాయన్నారు. హాజరయ్యే వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, ఫోటోలు, ఆధార్, రేషన్ కాపీలు తీసుకురావాలన్నారు.