SKLM: హిరమండలంలోని నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకానికి సంబంధించిన గొట్ట బ్యారేజీ పనులను ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ కేవీఎన్ స్వర్ణకుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ మేరకు పనుల పురోగతిని అధికారులు సమీక్షించి, పనులు సకాలంలో వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈసీడీవో విజయభాస్కర్, వంశధార ఎస్ఈ రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.