నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 108 కార్యాలయంలో గురువారం జాతీయ ఈయంటి డే వేడుకలు ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్, జిల్లా కో ఆర్డినేటర్ స్వరాజ్ మరియు సిబ్బంది అధ్యర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ 108 సర్వీసుల్లో ఈఎంటి లది ప్రత్యేక పాత్ర అని తెలిపారు. జిల్లా ఈయంటిలకు అయన శుభాకాంక్షలు తెలిపారు.