ప్రకాశం: న్యూ ఢిల్లీ పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కూటమి ఎంపీల బృందంతో పాల్గొన్నారు.