ASR: సీలేరులోని ధారకొండ ధారాలమ్మ ఆలయ హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. నగదు రూ.4.76 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో సాంబశివరావు తెలిపారు. అమ్మవారి జాతర ముగిసిన తరువాత హుండీ లెక్కించామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి, ఇన్స్పెక్టర్ ఉమాదేవి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.