WNP: విద్యుత్ బస్సులతో ఆర్టీసీ ప్రమాదంలో పడే ప్రభావాలపై ఈ నెల 12న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సు కరపత్రాలను వనపర్తిలో ఆవిష్కరించారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఖయ్యూం, డిపో కార్యదర్శి నాగేశ్వర్లు మాట్లాడుతూ.. ఆర్టీసీలో విద్యుత్ బస్సులు నడపాలని ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.