NTR-ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో ‘డ్రాగన్’లో తాను నటించడం లేదని మలయాళ స్టార్ టొవినో థామస్ స్పష్టం చేశాడు. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన కొత్త సినిమా ‘పళ్లిచట్టంబి’ ప్రమోషన్స్‌లో వెల్లడించాడు. తెలుగు సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ ఎక్కువగా ఉంటాయని, ఒకేసారి 2-3 సినిమాలు చేయడం తనకు ఇష్టం ఉండదని తెలిపాడు.