‘బేబీ’ కాంబో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘EPIC- First Semester’. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి ఆ తేదీన రావాల్సిన ‘పెద్ది’ వాయిదా పడే అవకాశం ఉండటంతో, మేడే, వీకెండ్ సెలవులను క్యాష్ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.