JGL: వెల్గటూర్లోని కేజీబీవీ కళాశాలలో ‘వృత్తి విద్య సమ్మర్ ఇంటర్న్ షిప్-2026’ను ఎస్ఓ మోకేన దీప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికి పరిమితం కాకుండా ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందన్నారు.