SKLM: కొత్తవలసలోని నిమ్మలపాలెం జంక్షన్లో వెలసిన శ్రీ సాయి శ్రీ ధర్మశాస్త్ర పీఠంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతిని సమర్పించారు.