కృష్ణా: తోట్లవల్లూరు మండలం పాములలంక గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవికాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ప్రజల దాహార్తిని తీర్చే మంచి కార్యక్రమం అని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చేస్తున్న మాజీ సర్పంచ్ని ఆయన అభినందించారు.