పల్నాడు: సత్తెనపల్లిలో కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించింది. బుధవారం సుందరయ్య కాలనీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతూ ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ పథకం కింద మగ్గాలకు 200, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుందన్నారు.