VSP: జిల్లాలో బుధవారం జరిగిన పదో తరగతి వృత్తిపర కోర్సు థియరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 20 కేంద్రాల్లో 3,091 మంది విద్యార్థులకు గాను 3,027 మంది హాజరు కాగా, 64 మంది గైర్హాజరయ్యారు. సంస్కృతం పేపర్-1కు 30 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. మొత్తం హాజరు శాతం 97.94గా నమోదైంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు.