WNP: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పురుషోత్తం రెడ్డి ఎంపిక కావడం పట్ల జిల్లాలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఘనంగా సన్మానించారు. పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం భవిష్యత్తు కార్యక్రమాల వంటి అంశాలపై చర్చించారు.