MLG: వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామంలో నూతన మహిళా సంఘం భవన నిర్మాణ పనులను గురువారం గ్రామ సర్పంచ్ పెండేల అశోక్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.