డైరెక్టర్ మారుతి, అక్కినేని అఖిల్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ కాబోతున్నట్లు టాక్. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు ముగిశాయని, అఖిల్ కోసం మారుతి ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అక్కినేని అభిమానులకు ఇది పెద్ద పండగే అని చెప్పాలి. ఈ మాస్ & క్లాస్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.