కోనసీమ: భక్తుల సౌకర్యార్థం APSRTC రావులపాలెం డిపో నుంచి జిల్లా పుణ్యక్షేత్ర దర్శి యాత్రకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ కుమార్ తెలిపారు. ఈ బస్సు ప్రతీ శనివారం రావులపాలెం నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు. ఈ యాత్రలో వాడపల్లి, ర్యాలీ, అంతర్వేది, అప్పనపల్లి, కుండలేశ్వరం, మురమళ్ళ, అయినవిల్లి క్షేత్రాలను దర్శించుకోవచ్చన్నారు.