TG: ఎన్నికల నేపథ్యంలో కేరళ ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణను దత్తత తీసుకున్నారని ఆమె చొరవ వల్లే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. పెట్టుబడులు తెచ్చి కేరళను అభివృద్ధి చేసేవారికే ఓటు వేయాలని సూచించారు.