SRPT: వేసవి ఎండల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెల్ల రేషన్ కార్డు దారులకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలల బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే ఒకే సారి పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా కోదాడ లోని 7వ, 8వ వార్డుల్లో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వార్డుల కౌన్సిలర్లు చైతన్య నాయక్, ఉదయశ్రీ హరిప్రసాద్‌లు ప్రారంభించారు.