PPM: చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు వరం అని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. పార్వతీపురం మండలం సంగంవలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లును ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర లబ్దిదారులకు బుధవారం పంపిణీ చేసారు. లబ్దిదారుల ఇళ్లకు వెల్లిన ఎమ్మెల్యే, పెన్షన్ దార్లను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.