BHPL : ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 2 వరకు గడువు ఉందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. వ్యవసాయ డ్రోన్లు, సోలార్ పంప్ కంట్రోలర్లు, పాడి పశువుల పెంపకం వంటి యూనిట్లపై ప్రభుత్వం రుణాలిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ఎస్సీ నిరుద్యోగులు వెంటనే ఎస్సీ కార్పొరేషన్ ఆన్ లైన్ పోర్టల్లో అప్లై చేసుకోవాలన్నారు.