E.G: పెరవలిలో బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ & మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఇంటికే అందిస్తోందని ఆయన తెలిపారు.