NGKL: నల్లమల అడవి దారిలో శివ నామస్మరణ మారుమోగుతోంది. బుధవారం ఏప్రిల్ 1న జాతర ప్రారంభం కావడంతో, నాగర్కర్నూల్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన సలేశ్వరం రామలింగేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలం ప్రధాన రహదారి నుంచి అడవి లోపలికి వెళ్లే దారిలో వాహనాలు భారీగా నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.