KMM: వైరా నియోజకవర్గ వ్యాప్తంగా ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోందని ఉద్యానవన శాఖ అధికారి ఆకుల వేణు తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు రైతుల్లో సాగుపై ఆసక్తిని పెంచుతున్నాయని పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం మండలాల వారీగా కొనిజర్లలో 3,092ఎకరాలు, ఏన్కూరులో 2,991, వైరాలో 556, సింగరేణి మండలంలో 426 ఎకరాల్లో సాగు జరుగుతోందని ఆయన తెలిపారు.