GNTR: తెనాలి పట్టణంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగింది. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక సీఎం కాలనీ, మారీస్పేట, బాలాజీరావుపేట తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే స్వయంగా వెళ్లి పింఛన్ల నగదును అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.