MDK: రామాయంపేట మండలం తొనిగండ్ల శివారులోని ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి అక్రమంగా ఇతరులకు విక్రయించారని, తహశీల్దార్‌పై వార్త రాసిన ఇద్దరు రిపోర్టర్లకు రామాయంపేట తహశీల్దార్ రజనీకుమారి నోటీసులు జారీ చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 94/1లో ప్రభుత్వ భూమి విక్రయించినట్లు రాసిన వార్తపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు తప్పావన్నారు.