WNP: ఆత్మకూరు పట్టణంలో పన్ను బకాయిలు చెల్లించని వ్యాపారులు, గృహ యజమానులకు మున్సిపల్ కమిషనర్ శశిధర్ హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. కమర్షియల్ సముదాయాలు, ప్రధాన కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి దీర్ఘకాల బకాయిలు ఉన్నవారిని గుర్తించారు. వెంటనే పన్నులు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.