VKB: డ్వాక్రా భవనం నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. మహిళా సంఘాలను కోటీశ్వరులను చేస్తామని ప్రజాప్రతినిధులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. వారి మాటలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. అధికారుల అలసత్వం, ప్రజాప్రతినిధుల పట్టించుకోకపోవడంతో మహిళాసంఘాల కోసం నిర్మించిన కుల్కచర్లలో పనులు ఆగిపోయాయి. అధికారులు, స్పందించి భవన నిర్మాణం పూర్తిచేయాలని కోరుతున్నారు.