PPM: పార్వతీపురం మునిసిపాలిటీ అగ్రహారం వీధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర రెడ్డి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను పలకరించి పింఛన్లు అందజేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఈ పింఛన్ కొండంత అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వైశాలి, మున్సిపల్ కమిషనర్ పావని తదితరులు పాల్గొన్నారు.