KDP: బద్వేలు ( M) చెన్నంపల్లి సమీపంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆది చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈనెల 4వ తేదీన బండలాగుడు పోటీలు జరగనున్నాయని నిర్వాహకులు గురువారం తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. మొదటి బహుమతి రూ.50,116, ద్వితీయ బహుమతి రూ.40,116, తృతీయ బహుమతి రూ.30,116 తో పాటు మిగతా బహుమతులు ఉంటాయని తెలిపారు.