ELR: జిల్లా వ్యాప్తంగా ఇవాళ పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌ను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని డివిజన్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. ప్రజలు నేరుగా రావడమే కాకుండా, ‘మీకోసం’ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.