PDPL: వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, పెండింగ్ బిల్స్ క్లియర్ చేపిస్తామని చెప్పే ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీధర్ తెలిపారు. బిల్లులు జిల్లా స్థాయిలో క్లియర్ కావనే విషయాన్ని గమనించాలన్నారు. అలాగే నిరుద్యోగులు వారధి సొసైటీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.