PLD: అమరావతి మండలం ఉంగుటూరులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసిన ఆయన, కూటమి ప్రభుత్వం పెంచిన పింఛన్ల పట్ల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.