ATP: జిల్లాలో గత 24 గంటల్లో పలు మండలాల్లో వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లా సగటు వర్షపాతం 3.2 మిల్లీమీటర్లుగా నమోదైందని అధికారులు తెలిపారు. అత్యధికంగా గుత్తిలో 31.2 మి.మీ, ఉరవకొండలో 28.2 మి.మీ వర్షం కురిసిందని పేర్కొన్నారు. జిల్లా మొత్తం మీద 102.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.