PDPL: అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మెర్గు చంద్రయ్య డిమాండ్ చేశారు. అంతర్గాం(M) CPI(ML) న్యూ డెమోక్రసీ ఆఫీసులో మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పొట్టకొచ్చిన వరి, మొక్క జొన్న, నువ్వులు, కూరగాయల పంటలు నేలపాలయ్యాయని అన్నారు.