BPT: బాపట్ల మండలం మరుప్రోలువారి పాలెం గ్రామంలో నూతన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్థానిక చిన్నారులతో కలిసి ఈ నూతన భవనాన్ని ప్రారంభించారు. చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ భవనాన్ని నిర్మించారు.