కడప-తిరుపతి రహదారిపై ఒంటిమిట్ట ఆలయం ఉంది. కడప నుంచి 26 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు. రైలులో రాజంపేట రైల్వేస్టేషన్లో దిగి బస్సులో ఒంటిమిట్టకు చేరుకునే సౌలభ్యం ఉంది. కడప రైల్వేస్టేషన్లో కూడా రైలు దిగి బస్సు, ఇతర వాహనాల్లో ఒంటిమిట్టకు చేరుకోవచ్చు. తిరుపతి విమానాశ్రయం 100కి.మీ దూరంలో, కడప విమానాశ్రయం నుంచి ఒంటిమిట్ట ఆలయానికి 35 కిలోమీటర్లు ఉంటుంది.