MDK: దౌల్తాబాద్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జమదగ్ని ముని-రేణుక మాత కల్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ నాగపడిగ, ఎరుకల బుట్టిని డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల మధ్య పురవీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం అమ్మవారి గర్భగుడిలో వీటిని భక్తిశ్రద్ధలతో సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.