NLR: సీతారామపురం(మం) అయ్యవారిపల్లికి చెందిన బొగ్గవరపు సన్నీ ఫోన్ చోరీకి గురైందని బుధవారం ఉదయం PSలో ఫిర్యాదు చేశారు. సీతారామపురంలోని ఓ షాపులో టీ తాగి బయటికి రాగానే ఫోన్ పోయిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఏఎస్సై వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో కానిస్టేబుల్ సుమంత్ గంట వ్యవధిలోనే ఫోన్ను రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు.