NRPT: మరికల్ మండలం అప్పంపల్లికి చెందిన యువ ఉపాధ్యాయురాలు సునీత (25) అనారోగ్యంతో కన్నుమూశారు. ధన్వాడ మండలం మణిపూర్ తండా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆమె, హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. ఏడాదిన్నర క్రితమే ప్రభుత్వ ఉద్యోగం సాధించి, ఎంతో భవిష్యత్తు ఉన్న సునీత అకాల మరణం అప్పంపల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.