NLG: చిట్యాల, సంతోష్ నగర్ అంగన్వాడీ కేంద్రం-2లో బుధవారం ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశం జరిగింది. వైస్ ఛైర్పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, గర్భవతి గుండాల పావనికి శ్రీమంతం చేసి, పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించారు. లబ్ధిదారులందరూ ఆరోగ్యలక్ష్మి భోజనం, బాలామృతాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కౌన్సిలర్ ఎల్లయ్య, వైద్యులు, కన్వీనర్ అరుణ పాల్గొన్నారు.