NRML: పట్టణంలోని దేవరకోట వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని గురువారం సాయంత్రం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రథోత్సవం పట్టణంలోని పురవీధుల గుండా కొనసాగుతుందని మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి రథోత్సవంలో పాల్గొనాలని కోరారు.