CTR: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి, కార్మికులు సాధించిన 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన బ్లాక్ డేలో భాగంగా నగరిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల హక్కులు దెబ్బతింటాయని చెప్పారు.